బెల్ట్ తీద్దాం..! | Bayyaram in sp sumathi | Sakshi
Sakshi News home page

బెల్ట్ తీద్దాం..!

Published Mon, Oct 12 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

బెల్ట్ తీద్దాం..!

బెల్ట్ తీద్దాం..!

* చెడు వ్యసనాల బానిసలను సన్మార్గంలో పెడదాం
* గ్రామ సభ నిర్వహించండి... నేనూ వస్తా
* బయ్యారంలో ఎస్పీ సుమతి
గజ్వేల్: ‘గ్రామంలో బెల్టు షాపుల జాబితా తయారు చేయండి, పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతున్న వారి వివరాలను సైతం సేకరించండి. త్వరలోనే గ్రామ సభ నిర్వహించండి. నేనూ వస్తా.. ఊరిని బాగుచేసుకుందాం.. ’ అంటూ ఎస్పీ సుమతి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బయ్యారంలో అత్యాచార ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన ఎస్పీ గ్రామాస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

బెల్ట్ షాపులను విచ్చలవిడిగా నిర్వహించడం వల్ల యువత మద్యానికి బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. మరో వైపు ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా ఉన్నవారు సైతం చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ దుస్థితిని మార్చాలంటే బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు చెడు వ్యసనాలకు గురైనవారిని సన్మార్గాంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement