రేవ్ పార్టీ కాదు.. గృహప్రవేశం: నవదీప్ | police attacks on hero form house | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీ కాదు.. గృహప్రవేశం: నవదీప్

Published Sat, Mar 26 2016 11:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రేవ్ పార్టీ కాదు.. గృహప్రవేశం: నవదీప్ - Sakshi

రేవ్ పార్టీ కాదు.. గృహప్రవేశం: నవదీప్

మోమిన్‌పేట్: హీరో నవదీప్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ చేసుకున్నాడని ఆ సమయంలోనే పోలీసులు దాడులు చేశారని కానీ  నవదీప్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నవదీప్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. అసలు ఆ రేవ్ పార్టీ గోలేంటో తనకేమీ తెలియదని చెబుతున్నాడు. తనకి ఫామ్ హౌసే లేదంటున్నాడు. మీడియాను ఉద్దేశించి ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ``మీరు నా పేరు వాడిన ప్రతిసారీ ఒక్కో రూపాయి ఇచ్చినా నేను ఫామ్ హౌస్ కొనగలిగేవాడినేమో. ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా. మరొకటి వేసేద్దాం అనుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్తే.. రేవ్ పార్టీలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రేవ్ పార్టీతో నాకేంటో సంబంధం?.. వాడు చెప్పాడని.. వీడు రాశాడని.. ఇంకొకడు రాశాడంట..దేశానికి నేను ఎలాగూ పనికిరానని మీ ఫీలింగ్ కదా.. పోనీలే.. మీరైనా పనికిరండి. నన్ను పక్కనపెట్టి పనికొచ్చే పనిచేయండి.. పెద్దలు, కుటుంబంతో కలిసి గడిపిన ఓ గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ చేసిన మహానుభావులకు పాదాభివందనాలు..'' అంటూ అని ట్వీట్ చేశాడు.


కాగా యువ హీరో నవదీప్ చెందిన ఫాంహౌస్ పై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శనివారం తెల్లవారుజామున ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో నవదీప్ కు  ఫాంహౌస్ ఉంది. అందులో శుక్రవారం అర్థరాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని, కొందరు సినీ ప్రముఖులు మద్యం తాగుతూ డ్యాన్సర్లతో హంగామా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు చేపట్టారు. అయితే పార్టీలో పాల్గొన్న హీరో, మరికొందరు నటులు పరారైనట్టు సమాచారం. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ అరుణ్ సాయిని పోలీసులు అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులను పోలీసులు తప్పించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఓ ప్రముఖ నటుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నటుడు ఎవరు, ఏమిటన్నల వివరాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement