
ఇటీవలే కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో దర్శన్. గతేడాది చివర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్.. సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్‌లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్‌ఐఆర్‌పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు.
అసలేం జరిగిందంటే..
న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా పార్టీని కొనసాగించారు. సెలబ్రిటీలంతా కేక్‌లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment