హీరో జీవాకు రోడ్డు ప్రమాదం | Kollywood Hero Jiiva Car Accident Near Selam | Sakshi
Sakshi News home page

Jiiva: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

Published Wed, Sep 11 2024 3:41 PM | Last Updated on Sat, Sep 14 2024 10:22 AM

Kollywood Hero Jiiva Car Accident Near Selam

కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ  ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత తెలుగులో యాత్ర-2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో బాలీవుడ్‌లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా మెరిశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఆయన ఉన్నారు. 

(ఇది చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement