
కన్నడ నటుడు సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం మైసూర్-గుడ్లుపేట్ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న క్రమంలో బెగూర్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో నటుడి కాలు నుజ్జునుజ్జు అవడంతో ఆయన కుడికాలు తీసేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. 'సూరజ్ మైసూర్ నుంచి ఊటీకి బైక్‌పై బయలు దేరాడు. రోడ్డుపై ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది' అని తెలిపారు. కాగా దివంగత నిర్మాత పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడు, సినీ నిర్మాత ఎస్‌ఏ శ్రీనివాస్ తనయుడే సూరజ్ కుమార్. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో సూరజ్ తన పేరును ధ్రువన్‌గా మార్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment