బదులు తీర్చుకున్న ఏసెస్ | Rafael Nadal enthralls Delhi as Indian Aces thrash Philippines Mavericks to stay on top | Sakshi
Sakshi News home page

బదులు తీర్చుకున్న ఏసెస్

Published Fri, Dec 11 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

బదులు తీర్చుకున్న ఏసెస్

బదులు తీర్చుకున్న ఏసెస్

మావెరిక్‌పై గెలుపు
 న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోఫిలిప్పీన్స్ మావెరిక్‌పై ఇండియన్ ఏసెస్ జట్టు బదులు తీర్చుకుంది. భారత అంచె పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 30-12 తేడాతో మావెరిక్‌పై సునాయాసంగా గెలిచింది. ముందుగా మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న- సానియా మీర్జా జోడి 6-2తో హ్యువే- టోమ్లజనోవిక్‌పై నెగ్గి శుభారంభాన్ని అందించింది.

ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-1తో గజ్డోసోవాపై.. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో సాన్‌టోరో 6-1తో ఫిలిప్పోసిస్‌పై నెగ్గారు. ఇక పురుషుల డబుల్స్‌లో నాదల్- బోపన్న 6-4 వాసెలిన్- హ్యుయే జోడిపై.. పురుషుల సింగిల్స్‌లో నాదల్ 6-4తో వాసెలిన్‌ను ఓడించడంతో విజయం సంపూర్ణమైంది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్‌కు చెందిన జపాన్ వారియర్స్ 24-21 తేడాతో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement