
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పాక్టెరా భారత్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ ఆఫీస్‌ను బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు ఉన్నారని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రంగాపురం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
మూడేళ్లలో భారత ఉద్యోగుల సంఖ్య 3,000లకు చేరుతుందని వెల్లడించారు. ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఇంజనీరింగ్‌తోపాటు ఆర్ట్స్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో సొంత భవనాన్ని నెలకొల్పుతామని కంపెనీ ఇండియా హెడ్ నారాయణ్ మూర్తి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సంస్థలో 30,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని సొల్యూషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దినేష్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment