
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో(AP assembly sessions) భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్(abdul Nazeer) ప్రసంగంపై వైఎస్సార్ సీపీ పలు ప్రశ్నలు సంధించింది. అసలు గవర్నర్ ప్రసంగలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ఊసే లేకపోవడానికి కారణం ఏమిటో అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ఆత్మ స్తుతి, పరనిందలా ఉందని విమర్శించింది.
‘సీఎం చంద్రబాబు(Chandrababu Naidu).. గవర్నర్ ప్రసంగంలో పిట్ట కథలు చెప్పించారు. ప్రజలను ఎలా మోసం చేయాలో గవర్నర్ తో చెప్పించారు. విద్యా వ్యవస్థ సర్వ నాశనం అవుతున్నా.... లోకేష్ క్రికెట్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్ళారు. మరొకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్థ యాత్రలు చేస్తారు. మంత్రి లోకేష్ ఆయన శాఖను పట్టించుకోరు.పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సిఎం పోస్టు రాజ్యాంగం లో ఉందా?, ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేన కు డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చింది?,
ప్రజా స్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కి తెలుసా PAC చైర్మన్ పదవి అనేది ప్రతి పక్ష పార్టీకి ఇవ్వాలి. జనసేన పార్టీ PAC చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారు?2019 లో రెండు చోట్ల ఓడి పోయాక మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడ్రెస్ లేరు.భారత రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఎల్లోమీడియా నా పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు.

Comments
Please login to add a commentAdd a comment