వర్షం బారిన పడి అర్ధానందాన్నే మిగిల్చిన తొలి టెస్టు తర్వాత భారత్, శ్రీలంక సిరీస్‌లో ఆధిక్యం కోసం మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఇక్కడి జామ్‌తా స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టులో ఓటమికి చేరువైన లంక త్రుటిలో దానిని తప్పించుకోగా... గెలుపు భారత్ చేజారింది. గత మ్యాచ్‌లో ముందుగా వెనుకబడి కూడా విజయావకాశాలు సృష్టించుకొని భారత్ తమ స్థాయిని ప్రదర్శించగా... శ్రీలంక తడబాటుతో తమ బలహీనతలు బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి.