
కచ్చా బాదామ్ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు భుబన్ బద్యాకర్. పల్లీలు అమ్ముకుంటూ తాను పాడిన పాట యూట్యూబ్‌కి చేరిన తర్వాత నేషనల్ స్టార్ అయ్యాడు. సామాన్యులు మొదలు సినీ సెలబ్రిటీల వరకు కచ్చాబాదం మంత్రం జపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌గోయల్ చేరారు. ఈ ఏడాది ఇండియా నుంచి పదో యూనికార్న్ కంపెనీగా గుర్తింపు పొందిన హసురా ఎదుగుదల గురించి చెప్పేందుకు కచ్చా బాదామ్‌ని రిఫరెన్స్‌గా వాడుకున్నాడు.
బెంగళూరు, యూఎస్ బేస్డ్ హసురా కంపెనీ బుదవారం 100 మిలియన్ డాలర్ల పెట్టుబుడుల సాధించి యూనికార్న్‌గా గుర్తింపు పొందింది. తన్మయ్ గోపాల్, రాజోషి ఘోష్‌లు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ హసురా యాప్ ఇప్పటికే నాలుగు కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యింది. దీంతో వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులకు ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది యూనికార్న్ గుర్తింపు పొందిన పదో స్టార్టప్‌గా హసురా నిలిచింది.
Another 'Kacha Badam' becomes 'Pakka'
— Piyush Goyal (@PiyushGoyal) February 23, 2022
India adds its Tenth Unicorn in just 53 days pic.twitter.com/25RRezpfZF
హసురా విజయాలను కచ్చాబాదమ్‌తో పోల్చారు మంత్రి పియుష్ గోయల్. కచ్చా బాదమ్ సాంగ్ హిట్ కావడానికి ముందు ఆ తర్వాత భుబన్ బద్యాకర్ ఎలా ఉండేబాడో తెలిపే మీమ్‌ను ట్వీట్ చేస్తూ హసురా కంపెనినీ అభినందించారు.