Courtesy: IPL
IPL- Chennai Super Kings: ఐపీఎల్‌లో తిరుగులేని జట్టు... నాలుగుసార్లు విజేత అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలోని చాంపియన్ ఈ సీజన్ ఆరంభానికి ముందే అద్భుత రికార్డు సాధించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో అసాధారణ విజయాలు సాధించిన సీఎస్‌కే భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికార్న్ కంపెనీగా శుక్రవారం అవతరించింది. సీఎస్‌కే మార్కెట్ క్యాప్ 7,600 కోట్ల రూపాయలు దాటడం విశేషం.
ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ల ప్రైస్ బాండ్ విలువ రికార్డు స్థాయిలో 210-225 మధ్య ట్రేడ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మరో అతి పెద్ద రికార్డును కూడా సీఎస్‌కే తన పేరిట లిఖించుకుంది. మాతృసంస్థ ఇండియా సిమెంట్స్ మార్కెట్ క్యాప్ విలువను సీఎస్‌కే అధిగమించడం విశేషం. ప్రస్తుతం ఆ కంపెనీ స్టాక్ వాల్యూ 6869 కోట్ల రూపాయలుగా ఉండగా సీఎస్‌కే వాల్యూ 7600 కోట్లు. కాగా ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ గల ప్రైవేట్ సంస్థలను యూనికార్న్ కంపెనీలుగా పిలుస్తారు.
ఇక ఆట విషయానికొస్తే.. ఐపీఎల్ మెగా వేలం-2022కు చెన్నై సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహణ నేపథ్యంలో కెప్టెన్ ధోని ఇప్పటికే చెన్నైకి చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాడు. మెగా వేలానికి సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజా(16 కోట్లు), ఎంఎస్ ధోని(12 కోట్లు), మొయిన్ అలీ(8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(6 కోట్లు)ను అట్టిపెట్టుకుంటామని చెన్నై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఆటగాళ్ల కోసం మొత్తంగా ఫ్రాంఛైజీ 42 కోట్లు ఖర్చు చేయగా.. పర్సులో ప్రస్తుతం 48 కోట్ల రూపాయలు ఉన్నాయి.
చదవండి: India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా?
IPL 2022 Auction- MS Dhoni: జడేజా కోసం కోట్లు వదులుకున్నాడు.. జట్టు కోసం ఏమైనా చేస్తాడు.. అతడే మా కెప్టెన్!
Comments
Please login to add a commentAdd a comment