IPL 2022 Mega Auction: CSK CEO Interesting Comments On MS Dhoni Team Selection - Sakshi
Sakshi News home page

IPL 2022 Mega Auction- CSK: ప్రతిసారీ జట్టును ఎంపిక చేసేది అతడే.. ఒక్కసారి కూడా నిరాశపరచలేదు!

Published Sat, Feb 12 2022 9:43 AM | Last Updated on Sat, Feb 12 2022 11:54 AM

IPL 2022 Mega Auction: Every Time MS Dhoni Picks Team Says CSK CEO - Sakshi

చెన్నై సూపర్‌కింగ్స్‌(PC: IPL)

IPL 2022 Mega Auction- Chennai Super Kings: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు పేరుంది. నాలుగుసార్లు టైటిల్‌ గెలిచిన ఘనత సీఎస్‌కే సొంతం. ఈ విజయాల్లో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పాత్ర మరువలేనిది. జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహా అవసరమైన సమయంలో త్యాగాలు చేయడానికి కూడా వెనుకాడడు. ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో రిటెన్షన్‌ సమయంలో ధోని వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం.

రవీంద్ర జడేజా కోసం తన స్థానం త్యాగం చేశాడు. ధోని సలహా మేరకు 16 ​కోట్ల రూపాయలు వెచ్చించి మరీ జడ్డూను సీఎస్‌కే తమ మొదటి ప్లేయర్‌గా రిటైన్‌ చేసుకుంది. ఇక మెగా వేలం కూడా ధోని కీలక పాత్ర పోషిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే యాజమాన్యంతో కలిసి ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో ఆయన మాట్లాడుతూ... ‘‘అభిమానులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వేలంలో ప్రతి సారి తలా(ఎంఎస్‌ ధోని) జట్టును ఎంపిక చేస్తాడు. ఫ్యాన్స్‌ను ఎప్పుడూ తను నిరాశపరిచింది లేదు. అత్యుత్తమ జట్టును అతడు ఎంపిక చేస్తాడు’’ అని పేర్కొన్నారు. ఈసారి కూడా బెస్ట్‌ టీమ్‌ను ఎంచుకుంటామని తెలిపారు. కాగా జడేజాతో పాటు ధోని(12 కోట్లు), మొయిన్‌ అలీ( 8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు)ను సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది.

చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement