
కోల్‌కతా: దేశీయంగా స్టార్టప్‌లు వేగంగా పుట్టుకొస్తున్నట్లు నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఐవోటీ, ఏఐ విభాగాల సీఈవో సంజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. వార్షికంగా వీటి సంఖ్యలో 10 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు తెలియజేశారు. స్టార్టప్‌లలో అత్యధికం అప్లికేషన్‌వైపు ఊపిరిపోసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే సాఫ్ట్‌వేర్ మద్దతిచ్చే సర్వీసులలో మరింత ప్రగతి సాధించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. దేశీంలో ప్రతీ ఏటా 10 శాతం స్టార్టప్‌లు జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వీటి సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నదని, ఇందుకు పెట్టుబడి సంస్థలు నిధులు అందించడం దోహదం చేస్తున్నట్లు వివరించారు. అయితే కీలక రీసెర్చ్‌కు సంబంధించిన అంశాలలో స్టార్టప్‌లు ఆవిర్భవించవలసిన అవసరమున్నట్లు ప్రస్తావించారు.
మూడో పెద్ద వ్యవస్థ
స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు, ఎంటర్‌ప్రైజ్‌లు, ప్రభుత్వంతో కలసి దేశీయంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలకు అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తోంది. ప్రపంచంలోనే భారత్ మూడో పెద్ద ఎకోసిస్టమ్‌ను కలిగి ఉన్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సర్వే సైతం గత ఆరేళ్లలో ఇలాంటి స్టార్టప్‌లు భారీగా వృద్ధి చెందినట్లు పేర్కొంది. 2021–22కల్లా గుర్తింపు పొందిన కొత్త స్టార్టప్‌లు 14,000ను మించాయి. 2016–17లో ఇవి 733 మాత్రమే. తద్వారా అమెరికా, చైనా తదుపరి మూడో పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా దేశం ఆవిర్భవించినట్లు మల్హోత్రా తెలియజేశారు.
యూనికార్న్ జోరు
పటిష్ట ఎకోసిస్టమ్, ప్రోత్సాహకర పెట్టుబడుల కారణంగా దేశంలో మరిన్ని యూనికార్న్‌లు ఆవిర్భవించనున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. స్టార్టప్ వ్యవస్థలో బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. 2021లో దేశీయంగా 44 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను అందుకున్నాయి. దీంతో వీటి సంఖ్య 83ను తాకింది. వీటిలో అత్యధికం సర్వీసుల రంగంలోనే సేవలందిస్తుండటం గమనార్హం. స్టార్టప్‌లు ఊపిరిపోసుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల జాతీయ అసోసియేషన్(నాస్కామ్) అవసరమైన ఎకోసిస్టమ్‌ను కల్పిస్తున్నట్లు మల్హోత్రా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment