న్యూఢిల్లీ: యూనికార్న్ (స్టార్టప్) కంపెనీ జెట్‌వెర్క్ మ్యానుఫాక్చరింగ్.. అమెరికాకు చెందిన యూనిమాక్ట్స్ ను 39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.320 కోట్లు) పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని తెలిపింది.
ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు!
జెట్‌వెర్క్ కంపెనీ గత ఆరు నెలల్లో నాలుగో కంపెనీని కొనుగోలు చేస్తుండడం గమనించాలి. తాజా డీల్ మాత్రం తొలి విదేశీ కొనుగోలు అవుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేకు సంబంధించి సరఫరా వ్యవస్థలో భాగమైన కంపెనీలను జెట్‌వెర్క్ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ విధానంలో తయారు చేసి అందించడం జెట్‌వెర్క్ చేసే పని. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం)
Comments
Please login to add a commentAdd a comment