
ఫుడ్, గ్రోసరీస్ డెలివరీ స్టార్టప్‌గా ఇంగ్లండ్‌లో మొదలై అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన డెలివరూ ఇండియాలో తన కార్యకలాపాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో తొలి ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇంగ్లండ్ వెలుపల ఆ సంస్థకు ఇదే అతి పెద్ద సెంటర్. ఈ కామర్స్ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కస్టమర్లు హోం డెలివరికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇండియా లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో డెలివరూ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతోంది.
హైటెక్ సిటీ సమీపంలో ఉన్న స్కై వ్యూ బిల్డింగ్‌లో కో వర్కింగ్ మోడ్‌లో ఆఫీస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదితర రంగాల్లో పట్టున్న వారి కోసం రిక్రూట్‌మెంట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కామర్స్ సెక్టార్ బేస్డ్‌గా డెలివరీ ప్రధానంగా పని చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment