Engineering Center
-
హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రారంభించిన ఇంగ్లండ్ కంపెనీ
ఫుడ్, గ్రోసరీస్ డెలివరీ స్టార్టప్‌గా ఇంగ్లండ్‌లో మొదలై అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన డెలివరూ ఇండియాలో తన కార్యకలాపాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో తొలి ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇంగ్లండ్ వెలుపల ఆ సంస్థకు ఇదే అతి పెద్ద సెంటర్. ఈ కామర్స్ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కస్టమర్లు హోం డెలివరికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇండియా లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో డెలివరూ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతోంది. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న స్కై వ్యూ బిల్డింగ్‌లో కో వర్కింగ్ మోడ్‌లో ఆఫీస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదితర రంగాల్లో పట్టున్న వారి కోసం రిక్రూట్మెంట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కామర్స్ సెక్టార్ బేస్డ్గా డెలివరీ ప్రధానంగా పని చేయనుంది. -
హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు.. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు. -
హైదరాబాద్‌లో రాంబోల్
♦ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం ♦ 2018 నాటికి రూ.250 కోట్ల వ్యాపారం లక్ష్యం ♦ రాంబోల్ గ్రూప్ ఈడీ సోరెన్ జాన్సెన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెన్మార్క్ కేంద్రంగా ఇంజనీరింగ్, డిజైన్, కన్సల్టెన్సీ సేవలందిస్తున్న రాంబోల్... హైదరాబాద్‌లో తొలి ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇండియా, ఇతర మార్కెట్లకు టెలికాం రంగంలో సేవలందించేందుకు ఈ సెంటర్‌ను వినియోగిస్తామని రాంబోల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెట్స్ అండ్ గ్లోబల్ ప్రాక్టీసెస్) సోరెన్ జాన్సెన్ చెప్పారు. రాంబోల్ ఇండియా ఎండీ పవన్ మైనీ, టెలికాం డెరైక్టర్ పంకజ్ సచ్‌దేవ్‌లతో కలిసి బుధవారమిక్కడ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోరెన్ మాట్లాడుతూ... 230 మంది సుశిక్షితులైన నిపుణులు పనిచేసే ఈ సెంటర్లో టెలికం టవర్ల సాంకేతికత, ఇంజనీరింగ్, డిజైనింగ్, నిర్మాణం, అమ్మకాలు, రివర్స్ ఇంజనీరింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి వాటిల్లో సేవలందిస్తామని తెలియజేశారు. టెలికంతో పాటూ ఈ సెంటర్ నుంచి రవాణా, పట్టణ ప్రణాళిక వంటి వాటి డిజైనింగ్, రూపకల్పనలోనూ సేవలందిస్తామన్నారు. ‘‘మా మొత్తం వ్యాపారంలో ఇండియా వాటా 1.5 శాతం. దీన్ని రెండంకెల వృద్ధికి తీసుకెళ్లటమే మా లక్ష్యం. ఇందుకోసం టెక్నాలజీ కోసం, నిపుణుల నియామకంలోనూ భారీ పెట్టుబడులు పెడుతున్నాం. 2015లో ఇండియా ద్వారా రూ.160 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2018 నాటికి దీన్ని రూ.250 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని సోరెన్ వివరించారు. రైలు, అర్బన్ డిజైన్, ప్లానింగ్, బిల్డింగ్ స్ట్రక్చర్ వంటి విభాగాల్లో ఇతర కంపెనీల కొనుగోళ్ల వంటి వాటిపై దృష్టి పెట్టామని చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో ఈ కొనుగోళ్లు జరుపుతామన్నారు. డెన్మార్క్ కేంద్రంగా 1945లో ప్రారంభమైన రాంబోల్... 1.4 బిలియన్ యూరోల టర్నోవర్‌ను సాధిస్తోంది. 35 దేశాల్లో 300 కార్యాలయాలతో సేవలందిస్తున్న ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. ఇక్కడ సుమారు 800 మంది ఉద్యోగులున్నారు. ‘‘ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నగరంలో ఏర్పాటు చేస్తున్న గిడ్డంగి స్ట్రక్చర్‌ను మేమే డిజైన్ చేశాం. హైదరాబాద్ మెట్రో రైల్ రైడర్‌షిప్ సర్వే నిర్వహించింది కూడా మా సంస్థే’’ అని పవన్ తెలియజేశారు.