ముంబై: ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఆవిరౌతున్న(ఫండింగ్ వింటర్) నేపథ్యంలోనూ దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ బలపడే వీలున్నట్లు హురూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. రానున్న నాలుగేళ్లలో బిలియన్ డాలర్ల విలువ అందుకోగల స్టార్టప్‌ల సంఖ్య పెరగనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. దీంతో కొత్తగా 122 సంస్థలు యూనికార్న్‌లుగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేసింది.
తద్వారా దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 200ను మించనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను సాధించే స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఏడాది క్రితం 51గా నమోదైన యూనికార్న్‌ల సంఖ్య ప్రస్తుతం 84కు చేరినట్లు ప్రస్తావించింది. ఇప్పటికే 20 కోట్ల డాలర్లకుపైగా విలువ సాధించిన స్టార్టప్‌లు మరో 122 ఉన్నట్లు వెల్లడించింది. ఇవి రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే వీలున్నట్లు పేర్కొంది.
36 శాతం అప్
స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై ‘ఫండింగ్ వింటర్’ ప్రభావం చూపగలదని ఏఎస్‌కే ప్రయివేట్ వెల్త్‌తో జత కట్టిన హురూన్ ఇండియా.. ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 పేరుతో రూపొందించిన నివేదికలో అభిప్రాయపడింది. కఠిన పరపతి విధానాలతో ఇటీవల అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 36 శాతం విలువను పెంచుకున్న 122 స్టార్టప్‌ల విలువ 49 బిలియన్ డాలర్లకు చేరిన ట్లు వెల్లడించింది.
ఈ సంస్థలు బిలియన్ డాలర్ల విలువను అందుకోగలవని అభిప్రాయపడింది. ఈ సంస్థలు ప్రస్తుతం 82,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తున్న సంస్థలలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సీక్వోయా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేÆ ö్కంది. భవిష్యత్ యూనికార్న్‌లు 122లో 39 సంస్థలకు సీక్వోయా నిధులు అందించినట్లు వెల్లడించింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ 27 సంస్థలలో పెట్టుబడుల ద్వారా తదుపరి నిలిచినట్లు తెలియజేసింది.
రెండేళ్లలో...
తాజాగా రూపొందించిన జాబితాలోని 122 స్టార్టప్‌లలో 51 సంస్థలు రెండేళ్లలోనే బిలియన్ డాలర్ల విలువను సాధించే వీలున్నట్లు నివేదిక అంచనా వేసింది. తదుపరి మరో రెండేళ్లలో మిగిలిన 71 స్టా ర్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించవచ్చని తెలి యజేసింది. 2017లో ఏర్పాటైన లాజిస్టిక్స్ టెక్ స్టార్టప్ షిప్‌రాకెట్ ముందుగా ఈ హోదాకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఈకామర్స్ సంస్థ టర్టిల్‌మింట్ వేగ వంత వృద్ధి సాధించనున్నట్లు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment