
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్‌ల స్థాయికి ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment