కరోనా కొంత మంది ఉద్యోగాలు ఊడేలా చేస్తే.. ఫ్రెషర్స్‌కు మాత్రం బంపరాఫర్ ఇస్తోంది.మా ఆఫీస్‌లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. కానీ ఫ్రెషర్స్, ప్రస్తుతం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఆ ఆఫర్‌లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అందుకు కారణం ఏంటీ? అసలు ఐటీ కంపెనీల లోపల ఏం జరుగుతుంది.
ఫ్రెషర్స్, ఉద్యోగులు సైతం
మా ఆఫీస్‌లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు జీతాలిస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. దీంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలీటీతో పాటు ఇంకా మరెన్నో ఆఫర్లు అందిస్తున్నాయి. కానీ ఆఫర్ లెటర్‌లు అందుకున్న ఫ్రెషర్స్ సైతం..ఆ ఆఫర్లను వద్దనుకుంటున్నారు. అందుకు కారణం అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీయేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ కోర్స్‌లు నేర్చుకొని స్టార్టప్‌లలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కోవిడ్ సమయంలో విధించిన నిబంధనలు, అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీల వల్ల తలెత్తే ఇబ్బందులు, జీతాల వంటి ఇతర కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు.స్టార్టప్స్‌లో చేరుతున్నారు.
స్టార్టప్స్ జపం
ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ..ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టి వారికి నచ్చేలా ఉద్యోగాలు, ప్రమోషన్‌లు,జీతాలతో..స్టార్టప్‌లు,యూనికార్న్ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అంతెందుకు యూనికార్న్ కంపెనీలు సైతం మా కంపెనీ(ఇన్ఫోసిస్) ఉద్యోగులకు అవకాశం ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయని ప్రవీణ్ రావు అన్నారు.కాబట్టే టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ ఫ్రెషర్స్‌ను నియమించుకుంటూనే..అట్రిషన్ రేట్ తగ్గించుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇస్తున్నాయి.
కారణం అదే
కరోనా కారణంగా దేశంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ అంటే చేసే బిజినెస్, కల్చర్, కొత్త ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు కావాల్సిన మార్కెట్ రిక్వైర్ మెంట్స్ మారిపోయాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం మార్కెట్‌లో వస్తున్న కొత్త కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోర్స్‌లు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉన్నా..వారికి నచ్చిన జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. కాబట్టే ఇన్ఫోసిస్,టీసీఎస్ వంటి టెక్ కంపెనీలలో ఉద్యోగులు కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఒక్క ఇన్ఫోసిస్‌లోనే
గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. అట్రిషన్ రేట్ తగ్గించేందుకు ఈనెల నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల్ని భారీ ఎత్తున పెంచనుంది. ఇక ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్ చూస్తోంది.
ఎంతమందిని నియమించుకున్నాయంటే?
ఫైనాన్షియల్ ఇయర్ 2022లో టీసీఎస్ 1.03లక్షల మందిని..మూడు నెలల్లో ఎక్కువ మంది నియమించుకుంది. దీంతో మొత్తం 6లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
చదవండి: జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
Comments
Please login to add a commentAdd a comment