నాలుగు లిస్టింగ్‌లు.., రెండు పబ్లిక్ ఇష్యూల ప్రారంభంతో ఈ వారం దలాల్ స్ట్రీట్ కళకళలాడనుంది. పేటీఎంతో సహా మొత్తం నాలుగు కంపెనీల షేర్లు ఈ వారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇందులో నేడు పీబీ ఫిన్‌టెక్, సిగాచీ ఇండస్ట్రీస్, ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల లిస్టింగ్ కార్యక్రమం ఉంది. ఈ మూడు కంపెనీలు ప్రాథమిక మార్కెట్ నుంచి రూ.6,550 కోట్ల సమీకరించాయి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. ఇదే వారంలో టార్సన్స్ ప్రొడక్ట్స్, గో ఫ్యాషన్‌లు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ల్యాబొరేటరీ ఉపకరణాల తయారీ సంస్థ టార్సన్స్ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. బుధవారం (నవంబర్ 17)తో ముగిసే ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,023 కోట్లను సమీకరించనుంది. గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం మొదలవుతుంది. వచ్చే సోమవారం(22వ తేదీ)తో ముగిసే ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించనుంది. ఇందుకు రూ. 655–690 ధరల శ్రేణిని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment