అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది..
క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు.
ఆసక్తికర ‘ఫిలాసఫీ’!
సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.”
Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out…
— Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024
తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment