
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం.
అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది.
అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు.
కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్‌డీసీలో ఉబర్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment