అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్‌టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?
రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్‌లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది.
ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్‌కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా?
క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు
అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే!
ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్‌కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్‌గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు.
స్ట్రాటజీ
ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్ట్‌లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్‌లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్‌లను క్యాన్సిల్ చేస్తాడు.
కస్టమర్ల డిమాండే
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్‌కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్‌లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు.
రైడ్ రిక్వెస్ట్‌లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్‌లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్‌ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు.
ఇబ్బందులు తప్పవ్
రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్‌ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్‌లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు.
చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment