Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్‌మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.
బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్‌మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి.
కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్‌మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్‌ల రూపంలోనే 777 మిలియన్ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్‌మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు అందుకున్నారు.
స్క్వార్జ్‌మాన్ వాటాలు, డివిడెండ్‌లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్‌మాన్ నెట్‌వర్త్ 41.8 బిలియన్ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు).
Comments
Please login to add a commentAdd a comment