ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.
తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్‌లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.
కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment