![టోల్ ప్లాజాల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు](/styles/webp/s3/article_images/2017/09/4/71480104734_625x300.jpg.webp?itok=XcjqTOY2)
టోల్ ప్లాజాల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు
ఎన్‌హెచ్‌ఏఐతో సంస్థ ఒప్పందం
న్యూఢిల్లీ: మొబైల్ వ్యాలెట్ సంస్థ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. నగదుకు కొరత నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు తమ కస్టమర్లు మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అనుమతి లభించినట్టు సంస్థ తెలిపింది.
‘‘టోల్ ప్లాజాల వద్ద మొబిక్విక్ ద్వారా రుసుము చెల్లించాలనుకునే వారు తమ ఫోన్‌లోని యాప్‌ను ఓపెన్ చేసి ప్లాజాలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. టోల్ ఆపరేటర్ చెప్పిన నగదును, వాహన నంబర్‌ను ఎంటర్ చేసి ‘పే’ బటన్‌ను ప్రెస్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది’’ అని సంస్థ తెలియజేసింది. మరోవైపు, వాహనాల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు టోల్ రుసుములు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.