ఐపీవోల హవా | Waaree Energies gets SEBI green signal for IPO | Sakshi
Sakshi News home page

ఐపీవోల హవా

Published Wed, Sep 25 2024 3:09 AM | Last Updated on Wed, Sep 25 2024 8:04 AM

Waaree Energies gets SEBI green signal for IPO

2 కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

వారీ ఇంజినీర్స్, మొబిక్విక్‌కు సై 

కాసాగ్రాండ్‌ ప్రీమియర్‌ దరఖాస్తు 

నవంబర్‌లో ఎన్‌టీపీసీ గ్రీన్‌ రెడీ

రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా..  –సాక్షి, బిజినెస్‌డెస్క్‌

ఐపీవో చేపట్టేందుకు సోలార్‌ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్‌.. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్‌ పేమెంట్ల సంస్థ వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్‌లో, మొబిక్విక్‌ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి.  

వారీ ఇంజినీర్స్‌.. రూ. 3,000 కోట్లకుపైగా 
వారీ ఇంజినీర్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్‌గాట్‌ వేఫర్, సోలార్‌ సెల్, సోలార్‌ పీవీ మాడ్యూల్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  

మొబిక్విక్‌.. రూ. 700 కోట్లు     
తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్‌ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్‌ సర్వీసుల బిజినెస్‌ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్‌ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్‌ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్‌ టెక్నాలజీలపై ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ బాటలో పేమెంట్‌ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది.  

రూ. 10,000 కోట్లపై కన్ను  
విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్‌ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్‌ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.

ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెనెవబుల్‌ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను కలిగి ఉంది.   ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం!  

ఇదే బాటలో లీలా ప్యాలెస్‌ 
లీలా ప్యాలెస్‌ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్‌ బెంగళూరు లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్‌ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. 

వీటికి జతగా ప్రమోటర్‌ సంస్థ డీఐఎఫ్‌సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దన్నుగల ష్లాస్‌ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.

రూ. 1,100 కోట్ల సమీకరణ
రియల్టీ కంపెనీ కాసాగ్రాండ్‌ ప్రీమియర్‌ బిల్డర్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్‌ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.

14ఏళ్లలో సెప్టెంబర్‌ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు  
ఈ నెల(సెప్టెంబర్‌) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్‌లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్‌ బోర్డ్, ఎస్‌ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్‌ బులెటిన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్‌లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్‌ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. 

వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్‌ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్‌ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 

2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా  భారత్‌ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్‌ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement