సాక్షి, ముంబై : రానున్న ధంతేరస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ తాజాగా ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారికోసం ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్ ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలు కోసం 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ను మార్చుకుంటే.. వారికి ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ తిరిగి ఇస్తోంది. దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ‘మెగా ఎక్స్చేంజ్ వన్..గెట్ వన్' ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌పామ్ 'సేఫ్‌గోల్డ్' సంస్థతో మొబీక్విక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇలా కొనుగోలు చేపిన బంగారం ‘సేఫ్‌గోల్డ్' అకౌంట్‌లో జమవుతుంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్.. పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అక్టోబర్ 23 నుంచి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని మొబిక్విక్ ప్రకటించింది. యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత అది మొబీక్విక్ గోల్డ్ అకౌంట్‌కు వచ్చి యాడ్ అవుతుంది. అలాగే మొబిక్విక్ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మళ్లీ ఫిజికల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుగోలుదారులు తమ ఇంటికి కూడా డెలివరీ చేయించుకోవచ్చు. ఆన్‌లైన్ కొనుగోళ్లు మాదిరిగానే సమయంలో మాదిరిగానే తమ డెలివరీని ట్రాక్ చేయవచ్చు.
ఈ ఆఫర్‌పై మొబీక్విక్ సహ వ్యవస్థాపకుడు ఉపసానా టాకు మాట్లాడుతూ బంగారంపై భారతీయులకు ఎప్పుడూ మక్కువ ఉంటుంది, ముఖ్యంగా శుభ సందర్భాలలో, సంస్కృతి, సాంప్రదాయానికి తోడు సంక్షోభ సమయాల్లో ఆర్థిక సాయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బంగారం కొనుగోళ్లపై ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈనేపథ్యంలోనే గత ఏడాది ప్రారంభించిన డిజిటల్ గోల్డ్ సర్వీసులతో ఫెస్టివ్ సీజన్‌లో విశేష స్పందన లభించిందనీ, తాజా ఆఫర్‌లో కూడా దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా నుంచి కస్టమర్లనుంచి అధిక స్పందన వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment