Mega offer
-
లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్, డోంట్ మిస్!
హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్‌ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు. -
జూబ్లీహిల్స్‌లో రాజస్థానీ రుచులు
జూబ్లిహిల్స్: మంగళవారం తమ రెస్టారెంట్‌కు వచ్చే మహిళల కోసం జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో కొత్తగా ప్రారంభమయిన రాజ్థాలి రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు తమ వంటకాలపై ఏకంగా 25 శాతం డిస్కౌంట్ ఇస్తామని పేర్కొంది. మహిళలే నడిపించే ఈ రెస్టారెంట్లో గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన 32 రకాల వంటకాలను వండి వడిస్తారు. రోజుకో కొత్త రుచితో థాళీ తయారు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. -
బంపర్ ఆఫర్: గ్రాము గోల్డ్‌కి మరో గ్రాము ఉచితం!
సాక్షి, ముంబై : రానున్న ధంతేరస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ తాజాగా ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో బంగారం కొనుగోలు చేసే వారికోసం ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్ ప్రకటించింది. ఆఫర్లో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలు కోసం 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ను మార్చుకుంటే.. వారికి ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ తిరిగి ఇస్తోంది. దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ‘మెగా ఎక్స్చేంజ్ వన్..గెట్ వన్' ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్లాట్పామ్ 'సేఫ్గోల్డ్' సంస్థతో మొబీక్విక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇలా కొనుగోలు చేపిన బంగారం ‘సేఫ్గోల్డ్' అకౌంట్లో జమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్.. పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అక్టోబర్ 23 నుంచి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని మొబిక్విక్ ప్రకటించింది. యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత అది మొబీక్విక్ గోల్డ్ అకౌంట్‌కు వచ్చి యాడ్ అవుతుంది. అలాగే మొబిక్విక్ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మళ్లీ ఫిజికల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుగోలుదారులు తమ ఇంటికి కూడా డెలివరీ చేయించుకోవచ్చు. ఆన్లైన్ కొనుగోళ్లు మాదిరిగానే సమయంలో మాదిరిగానే తమ డెలివరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఆఫర్‌పై మొబీక్విక్ సహ వ్యవస్థాపకుడు ఉపసానా టాకు మాట్లాడుతూ బంగారంపై భారతీయులకు ఎప్పుడూ మక్కువ ఉంటుంది, ముఖ్యంగా శుభ సందర్భాలలో, సంస్కృతి, సాంప్రదాయానికి తోడు సంక్షోభ సమయాల్లో ఆర్థిక సాయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బంగారం కొనుగోళ్లపై ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈనేపథ్యంలోనే గత ఏడాది ప్రారంభించిన డిజిటల్ గోల్డ్ సర్వీసులతో ఫెస్టివ్ సీజన్లో విశేష స్పందన లభించిందనీ, తాజా ఆఫర్లో కూడా దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా నుంచి కస్టమర్లనుంచి అధిక స్పందన వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. -
మెగా హీరోతో 'కుమారి'
'నా పేరు కుమారి, ఏజ్ 21.. ఐ యామ్ ఫీమేల్, ఏం.. లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా.. నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా' అంటూ కుమారి 21f తో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన హెబా పటేల్ మాంచి హుషారు మీదుంది. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న హెబాను మరో క్రేజీ ఆఫర్ వరించిందట. మెగా హీరో వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో ఓ ముఖ్య పాత్రకు హెబాను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మరో ఆసక్తికర పాత్రలో హెబా కనిపించనుందని టాక్. ప్రస్తుతం మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు కలిసి నటిస్తున్న 'ఆడో రకం ఈడో రకం' సినిమాలో రాజ్ తరుణ్ కు జంటగా నటిస్తుండగా, నిఖిల్ హీరోగా మరో సినిమాకు సంతకం చేసింది. తాజాగా మెగా హీరో సినిమాలో అవకాశం మాట నిజమే అయితే ఇక కుమారి దశ తిరిగినట్టే.