
మరణ శిక్ష రద్దుకు కలాం మొగ్గు
న్యూఢిల్లీ: మరణ శిక్ష రద్దు చేయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయ పడ్డారు. తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు.. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల పడ్డ మరణ శిక్షలపై నిర్ణయం తీసుకోవడానికి చాలా బాధపడ్డానని అన్నారు. 1990లో జరిగిన ఒక కేసులో మాత్రం లిఫ్ట్ ఆపరేటర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని.. ఆ కేసులో మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. లా కమిషన్ మరణ శిక్షపై స్పందించమని అడిగిన 400 మంది ప్రముఖుల్లో అధిక శాతం దాన్ని కొనసాగించాలనే అభిప్రాయపడగా..
ఎత్తివేయాలన్న కొద్దిమందిలో కలాం ఒకరు. తాను రాష్ట్రపతిగా బాగా ఇబ్బంది పడ్డ అంశాల్లో కోర్టులు విధించిన మరణ శిక్షపై నిర్ణయం ఒకటని ఆయన లా కమిషన్ కన్సల్టేషన్ పత్రంలో పేర్కొన్నారు.