జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం | First Meeting Of One Nation One Election Committee Done - Sakshi
Sakshi News home page

ముగిసిన తొలి భేటీ.. జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

Sep 23 2023 8:12 PM | Updated on Sep 23 2023 8:23 PM

first meeting of One Nation One Election committee Done - Sakshi

జమిలి ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కీలక నిర్ణయం.. 

సాక్షి, ఢిల్లీ: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. శనివారం ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలిపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలనుకుంటోంది.

జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు జమిలి కమిటీ చైర్మన్‌ కోవింద్‌. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్‌వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్‌ నిర్ణయించింది. 

జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్‌లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. ఇక.. లా కమిషన్‌ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్‌ కమిటీ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement