హెచ్ఎస్బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత
ముంబై: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్‌ఎస్‌బీసీ.. తన బ్రాంచ్‌ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్‌ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలిపింది. గువాహటి, ఇండోర్, లక్నో, జోద్‌పూర్, థానే, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, త్రివేండ్రం, సూరత్ వంటి తదితర ప్రాంతాల్లోని బ్రాంచ్‌లను మూసివేయనున్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోని బ్రాంచులను అలాగే కొనసాగించనుంది. బ్రాంచ్‌ల సంఖ్య తగ్గినా.. రిటైల్ కార్యకలాపాల్లో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తామని పేర్కొంది.