Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 55.12 పాయింట్ల తగ్గుదలతో 66629.14 వద్ద, నిఫ్టీ 3.50 పాయింట్ల లాభాలతో 19748.50 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నష్టాల్లోనూ సాగుతోంది, నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
టాప్ గెయిన్ కంపెనీల జాబితాలో ఐటీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, టీసీఎస్ వంటివి ఉన్నాయి. కాగా రిలయన్స్, కోటక్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యు స్టీల్, హెచ్‌సీఎల్ సంస్థలు నష్టాల్లో పయనిస్తున్నాయి. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు మిశ్రమ ఫలితాలను పొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment