
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో వరుసగా మూడో సెషన్లో కూడా నష్టపోయింది. అటు నిఫ్టీ 15100 దిగువకు చేరింది. అయితే ఆరంభంలో 260 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ ఆ తరువాత భారీగా పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. లాభనష్టాల మధ్య కదలాడుతున్నసెన్సెక్స్ సెన్సెక్స్ 66 పాయింట్ల ఎగిసి 51385 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.
మెటల్స్, ఆటో కౌంటర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. గెయిల్, యూపీఎల్ ,హెచ్‌యూఎల్ , అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment