
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మొత్తానికి లాభాల్లో ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఒడిదుడుకులనెదుర్కొన్న సూచీలు చివరకు పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59085 వద్ద, నిఫ్టీ 27పాయింట్ల లాభంతో 17604 వద్ద స్థిరపడ్డాయి.తద్వారా కీలక మద్దతు స్థాయిల వద్ద బలంగా నిలబడటం విశేషం.
అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గ్రాసిం, లాభపడగా, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీస్, టైటన్, ఐటీసీ నష్టపోయాయి. మరోవైపుడాలరు బలహీనత నేపథ్యంలో రూపాయి 8పైసలు ఎగిసి 79.80 వద్ద ముగిసింది.