
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలనను కోల్పోయాయి. తీవ్ర ఓలటాలిటీ మధ్యసెన్సెక్స్ 145 పాయింట్లు ఎగిసి 57291 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 17048 వద్ద కొనసాగుతున్నాయి.
బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఇండస్ ఇండ్, డా.రెడ్డీస్ లాభపడుతుండగా, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, టైటన్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు కుప్పకూలి 81.38 వద్ద కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయిన సంగతి తెలిసిందే.