సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.ఆరంభం లాభాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత ఎగిసినప్పటికీ, ఆ తరువాత ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కురిసింది. ఫలితంగా డే హైనుంచి సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైన కుప్పకూలింది. చివర్లో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 310 పాయింట్ల పతనమై 58774 వద్ద,నిఫ్టీ83 పాయింట్లు క్షీణించి 17522 వద్ద స్థిరపడింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.ముఖ‍్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల నష్టాలు ప్రభావితం చేశాయి. ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. శ్రీ సిమెంట్, దివీస్, హిందాల్కో, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment