
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి దాదాపు 500 పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు అనంతరం 100 పాయింట్ల నష్టాలకు పరిమితమయ్యాయి. కానీ మిడ్ సెషన్ నుంచి అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా సె న్సెక్స్ 390 పాయింట్లు పతనమై 34780 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టతో 10260 వద్ద కొనసాగుతోంది. మెటల్, రియల్టీ, బ్యాంకింగ్, ఫార్మ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రేటింగ్ డౌన్ గ్రేడ్ కారణంగా యాక్సిస్ బ్యాంకు 5 శాతం కుప్పకూలింది. కోల్ ఇండియా, నాల్కో, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోతున్నాయి. అలాగే ఎల్ అండ్ టీ, ఎస్ బీఐ, భారత్ ఫోర్జ్, బ్యాంకు ఆఫ్ బరోడా , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్ గాఉన్నాయి. (కరోనా వేవ్స్ : బంగారం పరుగు)
కేంద్ర మద్దతు కోసం మద్దతుకోసం ఎదురు చూడవద్దని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 4 శాతం నష్టపోగా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఒక్కొక్కటి 3శాతానికి పైగా, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియాల్టీ, శోభా, సుంటెక్ రియాల్టీ ఇతర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో కొన సాగుతున్నాయి. ఫలితాల ప్రభావంతో ఐటీసీ లాభాల్లో ఉంది. బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, హిందూస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment