
స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 48 పాయింట్లు బలపడి 39,092ను తాకగా.. నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 11,534 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,161- 39,052 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11546- 11517 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
బ్లూచిప్స్ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా, ఆటో రంగాలు బలపడగా.. బ్యాంక్స్, ఐటీ డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, బ్రిటానియా, గ్రాసిమ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఆటో, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీపీసీఎల్, ఎయిర్‌టెల్, టైటన్, మారుతీ, నెస్లే 1.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, యాక్సిస్, పవర్‌గ్రిడ్ 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.
అపోలో ప్లస్
డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్, అరబిందో, బయోకాన్, ఐబీ హౌసింగ్, పిరమల్, రామ్‌కో సిమెంట్, మదర్‌సన్, టీవీఎస్ మోటార్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్, ఎస్కార్ట్స్ 4-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు సన్ టీవీ, టాటా కెమ్, ఐడియా, ఐజీఎల్, పీవీఆర్, కంకార్, అమరరాజా, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 932 లాభపడగా., 552 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment