సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. రోజంతా కొనసాగిన తీవ్ర ఒడిదుడుకులు సామాన్య ట్రేడర్లను అయోమయంలో పడేశాయి. ఒక దశలో 600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్ వెంటనే తేరుకుంది. చివరి గంటలో 120 పాయింట్ల మేర లాభపడింది.అంటేడే కనిష్టంనుంచి దాదాపు 850 పాయింట్లు మేర పుంజుకుంది. కానీ వారాంతంలో ఇన్వెస‍్టర్ల అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభానికి పరిమితం కాగా, నిఫ్టీ 8 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ తప్ప దాదాపు అన్నిరంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ప్రధానంగా ఐటీ, మీడియా, ఫార్మా ,మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 52350కి దిగువన, నిఫ్టీ 15700కి దిగువన ముగిసింది.
ఓఎన్‌జిసి, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, యుపిఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ 7 శాతం లాభపడి టాప్ విన్నర్‌గా ఉంది. ఇంకా హెచ్‌యుఎల్,బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.
డాలరుమారకంలో భారత రూపాయి ఇంట్రాడే నష్టాలనుంచి తేరుకుని డాలర్‌కు 22 పైసలు ఎగిసి 73.86 వద్ద ముగిసింది. గురువారం నాటి ముగింపు 74.08 తో పోలిస్తే శుక్రవారం 74.10 వద్ద ఫ్లాట్ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment