
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే 450 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 32 వేలను టచ్ చేసింది. నిఫ్టీ కూడా 9350 పాయింట్లను అధిగమించింది. కానీ లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను కోల్పోయింది. తిరిగి పుంజుకుని సెన్సెక్స్333 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 9341 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్ గా ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లాభాల్లో ఉన్నప్పటికీ హై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. టాటామోటార్స్, ఎస్ బీఐ, వేదాంతా, ఓఎన్ జీసీ యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, రిలయన్స్ నష్టపోతుండగా ఫలితాలపై అంచనాలతో ఇన్ఫోసిస్, మెరుగైన ఫలితాలను ప్రకటించి హెచ్డీఎఫ్సీ , టీసీఎస్ లాభాపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment