
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగినా చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ పాయింట్లు క్షీణించి వద్ద, నిఫ్టీ పాయింట్లు నష్టపోయి వద్ద ముగిశాయి. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో చివర్లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి.
సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 39 వేల స్థాకియిక దిగువన, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11750కి దిగువన ముగిసాయి. ఐటీ, ఫార్మా నష్టాల్లో ముగియగా, రియల్టీ లాభపడ్డాయి. సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ ఈ రోజు మరింత కుదేలవ్వగా, ఇటీవల బాగా పడిపోయిన ఎస్‌బ్యాంకు షేరు టాప్ విన్నర్‌గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ గెయిల్, బయోకాన్, టీవీఎస్ మోటార్ తదితర షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు బాగా నష్టపోయాయి. రిలయన్స్ ఆల్‌టైం గరిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment