
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నా, అనంతరం 100 పాయింట్లకు పైగా క్షీణించింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ మిడ్‌సెషన్ తరువాత మరింత పుంజుకుంది. సెన్సెక్స్ 140 పాయింట్లు ఎగిసి 36703 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10829 వద్ద కొనసాగుతోంది.
ప్రధానంగా ఫార్మా ఆటో ఎఫ్‌ఎంసీజీ నష్టపోతుండగా పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్ లాభపడుతున్నాయి. భారతి, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, విప్రో, ఎన్‌టీపీసీ, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభ పడుతున్నాయి. మరోవైపు సన్ ఫార్మా 7 శాతం, టాటా మోటార్స్ 5 శాతం చొప్పున పతనం కాగా.. ఏషియన్ పెయింట్స్, జీ, మారుతీ, బ్రిటానియా, టైటన్, ఇండస్‌ఇండ్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా నష్టపోతున్నాయి.