స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ | Market open flat- IT, Pharma sectors up | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ

Published Mon, Sep 21 2020 9:45 AM | Last Updated on Mon, Sep 21 2020 9:45 AM

Market open flat- IT, Pharma sectors up - Sakshi

సరిహద్దువద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 45 పాయింట్లు బలపడి 38,891ను తాకగా.. 14 పాయింట్ల లాభంతో 11,519 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,940- 38,803 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,529- 11,492 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. 

ఐటీ స్పీడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా ఐటీ, ఫార్మా 1.3-0.7 శాతం మధ్య బలపడగా.. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4 శాతం జంప్‌చేయగా.. టీసీఎస్‌, జీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, కొటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ 2-1  శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే బజాజ్‌ ఆటో, సిప్లా, నెస్లే, గెయిల్‌, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ 1.5-0.75 శాతం మధ్య నీరసించాయి.
 
డెరివేటివ్స్‌లో..
డెరివేటివ్‌ కౌంటర్లలో బాలకృష్ణ, సన్‌ టీవీ, మణప్పురం, మైండ్‌ట్రీ, అరబిందో, కోఫోర్జ్‌, అపోలో హాస్పిటల్స్‌, వేదాంతా, ఇండిగో, అశోక్‌ లేలాండ్‌ 2.5-1.25 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్‌ స్టీల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బీవోబీ, బయోకాన్‌, బంధన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, లుపిన్‌, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఈసీ, పిరమల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్డ్‌, ఎక్సైడ్‌, పీఎన్‌బీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 938 లాభపడగా.. 850 నష్టాలతో కదులుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement