సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 250 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. అలాగే నిఫ్టీ 14350 దిగువకు చేరింది. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నప్పటిక భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ 43పాయింట్ల ఫ్టీ మాత్రం 17 పాయింట్లు మైనస్‌లో ఉంది. అయితే సూచీలకు మద్దతు స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఆటో స్టాక్స్ కూడాలాభాల్లో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ స్టాక్స్ నష్టపోతున్నాయి. పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్‌గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఎన్‌టిపిసి లాభపడుతుండగా, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుపిఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment