
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత బలహీనపడ్డాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, సరిహద్దులో పెరుగుతున్నఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 33363 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 9845 వద్ద ట్రేడ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్ట పోతున్నాయి. కోటక్ మహీంద్ర, ఎస్ బీఐ, ఇండస్ ఇండ్ బాగా నష్టపోతున్నాయి. దీంతో బ్యాంకు నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరోవైపు ఫార్మ ,ఐటీ రంగ షేర్లు లాభపడుతున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 79 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 9950 ఎగువకు చేరింది. కీలక సూచీల్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం కారణంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగనుందని నిపుణులు భావిస్తున్నారు.
చదవండి : నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!
Comments
Please login to add a commentAdd a comment