
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా పుంజుకున్నప్పటికీ, 300 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించి 39 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు పతనమై 11,544వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలకమైన 11600 స్థాయిని కోల్పోయింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాలు పుంజుకోగా, రియల్టీ నష్టపోతోంది. ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐషర్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టైటన్ లాభపడుతుండగా, ఇన్ఫ్రాటెల్ ఏకంగా 6 శాతం పతనమైంది. యస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్, ఎయిర్‌టెల్, వేదాంతా,ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాఆ మోటార్స్, ఇండస్‌ఇండ్ నష్టపోతున్నాయి.