
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో స్టాక్‌మార్కెట్లు శుభారంభం చేశాయి. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. 90 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 80 పాయింట్లు నష్టపోయి 35,984 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ సైతం 27 పాయింట్లు క్షీణించి 10,836 వద‍్ద కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 36వేల దిగువకు,నిఫ్టీ 10900 దిగువరకు చేరింది.
భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్‌టీ, ఇండిగో, యూపిఎల్ లాభపడుతున్నాయి. పవర్‌గ్రిడ్, హిందాల్కో, ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్ నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమైంది. 70మార్క్‌కు దిగువన డాలరు మారకంలో 69.69 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. ప్రస్తుతం 34 పైసలు ఎగిసి 69.64వద్ద కొనసాగుతోంది.