సాక్షి, ముంబై : అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద ఉంది. 10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. వొడాఫోన్, టైటన్, ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ స , గెయిల్ నష్ట పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment