
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. డెరివేటివ్ సెప్టెంబర్ సిరీస్‌కు శుభారంభాన్నిచ్చిన మార్కెట్లు అనంతరం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. తొలుత 250 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ తిరిగి అదే స్థాయిలో కుదేలైంది. మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుని 124 పాయింట్లు జంప్ చేసి 37193 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 28 పాయింట్లు లాభంతో 10975 వద్ద 11వేల దిశగా సాగుతోంది. అమెరికా, చైనా మధ్య తిరిగి వచ్చే వారం నుంచీ వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది.
ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 2 శాతం క్షీణించగా ఆటో 0.4 శాతం డీలాపడింది. అయితే మెటల్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగ లాభాలు మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయి. వేదాంతా, టాటా స్టీల్, హిందాల్కో, జీ, విప్రో, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, బ్రిటానియా లాభపడుతుండ పవర్‌గ్రిడ్, ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐబీ హౌసింగ్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, ఐవోసీ, బీపీసీఎల్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment